ఫార్మా కంపెనీ పై తక్షణమే చర్య తీసుకోవాలి..

by Sumithra |
ఫార్మా కంపెనీ పై తక్షణమే చర్య తీసుకోవాలి..
X

దిశ, భిక్కనూరు : "బోదారాగు కాలువ కనుమరుగు" అన్న శీర్షికతో "దిశ" వరుస కథనాలు ప్రచురించినప్పటికీ, స్పందించినట్టే స్పందించి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని జిల్లా ఆర్టీఐ ప్రతినిధి గంగల రవీందర్, సభ్యులు కర్రోల రాజు, గోసు స్వామి, ఆర్ శ్రీకాంత్, గోసు సతీష్, టి.స్వామిలు సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాలువ కబ్జా చేసిన ఫార్మా కంపెనీ పై చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనకాడుతున్నారని తహశీల్దార్ శివప్రసా ద్ ను ప్రశ్నించారు.

"దిశ" ఆన్ లైన్ పేపర్ లో వరుస కథనాలపై స్పందించి, సర్వేకు ఆదేశించామని చెప్పినా మీరు ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా కాలువ కనుమరుగు చేసిన ఫార్మా కంపెనీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ పనుల బిజీ వలన కాలువ సర్వే విషయం ఎక్కడిదాకా వచ్చిందన్న విషయాన్ని సర్వేయర్ ను అడగలేకపోయానని, తొందర్లోనే స్పాట్ కు వెళ్తానని వివరించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కాలువ విషయం నిర్లక్ష్యం చేస్తే మేము ఎక్కడి వరకైనా వెళ్తామన్నారు. ఈ విషయమై బాధిత రైతులను కలుపుకొని కాలువ కబ్జాపై కలెక్టర్ తో పాటు, ఇతర ఉన్నతాధికారులను కలుస్తామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed