పంట నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది

by Sridhar Babu |
పంట నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది
X

దిశ, భిక్కనూరు : వడగండ్ల వానతో నష్టపోయిన ధాన్యం రైతులకు, ఎన్నికల తరువాత పరిహారం ఇప్పించే బాధ్యత తనదేనని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ కు మద్దతుగా ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన రోడ్డు షోలో మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల రైతులకు నష్ట పరిహారం అందకుండా పోయిందని, ఎన్నికలు ముగిసిన వెంటనే రైతులందరికీ పరిహారం ఇప్పిస్తానని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదని స్పష్టం చేశారు. అదే విధంగా కాళేశ్వరం 22వ ప్యాకేజీ ద్వారా ఒక్క రైతు భూమి కోల్పోయినా తనతోపాటు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిర్మల్ రెడ్డిని ఇక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిలబెట్టాలని స్పష్టం చేశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని మతి లేని వాడిలా మాటలు చెప్పడం తగదన్నారు. అధికారంలోకి వస్తే మూడు గంటలు ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిని ఇక్కడి ప్రజలు తుక్కుతుక్కుగా ఓడిస్తారన్నారు. పెన్షన్ల కోసం ఒకరిద్దరు రోడ్డు షో లో వస్తుండగా అడిగారని, రాని వారితోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్నికలు ముగిసిన వెంటనే పెన్షన్లు మంజూరు చేయిస్తానని గంప వివరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ కొమ్ముల తిర్మల్ రెడ్డి, ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పెద్ద బచ్చ గారి నర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గోండ్ల సిద్ధ రాములు, సర్పం చ్ ల ఫోరం జిల్లా కన్వీనర్ మాడుగుల నర్సింలు యాదవ్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి, రైతుబంధు సేవా సమితి చైర్మన్ బోండ్ల రామచంద్రం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుర్రి గోపాల్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు బుర్రి రంజిత్ వర్మ, అమరావతి సిద్ధరాంరెడ్డి, జూకంటి మోహన్ రెడ్డి, బాలచంద్రం, శివలింగం, గాడి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed