- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతన్న.. జర ఆలోచించన్న...
దిశ, నవీపేట్ : జిల్లాలో ఏ రోడ్డు చూసినా ఆరబోసిన వరి ధాన్యపు కుప్పలే కనిపిస్తున్నాయి. హైవే రోడ్ నుండి గల్లీ రోడ్ల వరకు రాత్రి, పగలు ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. రోడ్ల పై నిర్లక్ష్యంగా వడ్లను ఆరబోస్తుండడం, వడ్ల కుప్పల పై కప్పిన కవర్ లతో రోడ్డు ప్రమాదాలు జరిగి గాయాలతో పాటు ప్రాణాలు పోతున్నాయి. పంటల చేతికి వచ్చే సమయంలో జిల్లాలో ఎక్కడ చూసినా రహదారులు ధాన్యపు కుప్పలే కనిపిస్తుంటాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మయిశ్చర్ చూసి కాంట వేస్తుండడంతో వడ్లను ఆరబెట్టడానికి రైతులు తమ పొలాలకు దగ్గరలో ఉన్న రహదారులను ఎంచుకుంటున్నారు. వడ్లను రోడ్డుకు ఇరువైపులా, ఒక క్రమపద్దతిలో కాకుండా రైతులకు అనువైన ప్రదేశాలలో ఆరబోస్తుండడం తో పాటు కుప్పల పై ఉంచే కవర్ లు గాలికి లేచిపోకుండా పెద్ద పెద్ద రాళ్లను ఉంచడంతో ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
ప్రతీ సీజన్లో ప్రమాదాలు - పట్టించుకోని అధికారులు
వరి కోతల సమయంలో వడ్లను రోడ్ల పై ఆరబోయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ నిర్లక్ష్యపు ఆరబోతలతో ప్రతి సీజన్ లో పదుల సంఖ్యలో ప్రమాదాలు గురవుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయాల పాలవడమే కాకుండా మృత్యువాత పడుతున్నారు. గతంలో కూతురు పెళ్లికి డేట్ ఫిక్స్ చేసుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా నందిపేట్ రహదారి పై చీకట్లో రోడ్డు పై ఉన్న వడ్ల కుప్పను ఢీ కొని ఒకరు మృతి చెందారు. గత సంవత్సరం నాగేపూర్ నుండి నవీపేట్ కు బైక్ పై వస్తుండగా బాసర రహదారి పై వేసిన వడ్ల కుప్ప వలన ప్రమాదానికి గురై యువకుడు మృతి చెందాడు. ఇలా నవీపేట్ మండలంలోని గాంధీ నగర్, మొకన్ పల్లి, మహంతం, నాగేపూర్, పోతంగల్ తదితర గ్రామాల్లో వడ్ల కుప్పల వలన జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందారు. ప్రతి మండలంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి.
జిల్లాలో ఇంతగా ప్రమాదాలు జరుగుతున్న పోలీసు, రెవెన్యూ, ఆర్ & బీ అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినపుడు తూతూ మంత్రంగా చర్యలు తీసుకునే అధికారులు ఆ తర్వాత షరా మాములుగా తీసుకుంటున్నారు. ఇంతలా ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కల్లాల నిర్మాణానికి మంగళం ?
గతంలో ఉపాధిహామీ నిధులతో పొలాల్లో కల్లాల నిర్మాణానికి నిధులు ఉండేవి. కల్లాల నిర్మాణానికి ఆసక్తి గల రైతులు అధికారులను వినతిపత్రం అందించగా రెవెన్యూ రికార్డ్ ల పరిశీలన తర్వాత నిధులు విడుదల అయ్యేవి. కానీ గత ప్రభుత్వంలో కల్లాల నిర్మాణాల నిధులు పక్కదారి పట్టడం, కేంద్ర ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడంతో కల్లాల నిర్మాణ పథకం ఆగిపోయింది. దీనితో అన్నదాతలు రోడ్ల పైనే ధాన్యం ఆరబోస్తున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు రైతులకు రోడ్డు ప్రమాదాల పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.