నలుగురు చైన్ స్నాచింగ్ దొంగల అరెస్ట్...

by Kalyani |
నలుగురు చైన్ స్నాచింగ్ దొంగల అరెస్ట్...
X

దిశ,ఆర్మూర్ : ఆర్మూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మోర్తాడ్ లో మోటార్ సైకిల్ పై వచ్చి మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కొని పరారైన నలుగురు చైన్ స్నాచింగ్ దొంగలను అరెస్టు చేసినట్లు ఏసీపీ గట్టు బస్వా రెడ్డి చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని ఆర్మూర్ ఏసీపీ గట్టు బస్వా రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ బస్వా రెడ్డి మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ కు చెందిన అబ్దుల్ సాజిద్, డిచ్ పల్లికి చెందిన బోయర్ శేఖర్, లక్షేట్టిపేట్ చెందిన పాతూరి తరుణ్, నిజామాబాద్ లోని మిర్చి కాంపౌండ్ కు చెందిన వర్మాజీ చంటి సాయికుమార్ లు ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడలో నుంచి పుస్తెల తాళ్లు, బంగారు గొలుసులను స్కూటీ, మోటార్ సైకిల్ పై వచ్చి లాక్కొని పరారయ్యే వారన్నారు.

మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో, మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంజర గ్రామంలో, బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో వీరు చైన్ స్నాచింగ్ చేశారన్నారు. లక్ష్మణ్ చందా పోలీస్ స్టేషన్ పరిధిలోని పీచార గ్రామంలో, జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలమడుగు గ్రామంలో చైన్ స్నాచింగ్ చేశారన్నారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేగాం గ్రామంలో, లక్ష్మణ్ చాందా పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ చేశారన్నారు. ఈ నలుగురు దొంగలను మోర్తాడ్ మండలంలోని దొనకల్ చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి వద్ద నుంచి 11 లక్షల విలువగల 15.7 తులాల విలువగల ఏడు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నా మన్నారు.

చోరీకి ఉపయోగించే ఒక నల్లటి స్కూటీ, ఎరుపు రంగులోని మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఈ వాహనాలకు నంబర్ ప్లేట్లు లేవన్నారు. ఈ కేసును భీంగల్ సీఐ శ్రీనివాస్, మోర్తాడ్ ఎస్సై అనిల్ రెడ్డి లు చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్నట్లు తెలిపారు. వీరితోపాటు మోర్తాడ్ కానిస్టేబుళ్లు సురేష్, నారాయణ, కమ్మర్పల్లి కానిస్టేబుల్ నవీన్ చంద్ర లను పోలీస్ కమిషనర్ అభినందించినట్లు చెప్పారు.

Next Story