- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ
by Shiva |

X
దిశ, బిక్కనూరు : బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి పడిపోగా.. సమయానికి అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ. వివరాల్లోకి వెళితే.. దోమకొండ మండలం మాందాపూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాన్వాయ్ తో మంగళవారం కామారెడ్డి నుంచి బయలుదేరారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్దకు రాగానే ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తికి ఫిట్స్ రావడంతో రోడ్డుపైనే పడిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న షబ్బీర్ అలీ తన కాన్వాయిని ఆపి సదరు వ్యక్తి వద్దకు వెళ్తాడు. అనంతరం అతడిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి తీసుకెళ్లి చికిత్స చేయించారు. వైద్యానికి అయ్యే డబ్బు బాధితుడికి అందజేసి అక్కడి నుంచి మాందాపూర్ కార్యక్రమానికి బయలుదేరారు.
Next Story