అరోమా హోటల్ భోజనం యమ డేంజర్

by Sridhar Babu |
అరోమా హోటల్ భోజనం యమ డేంజర్
X

దిశ, నిజామాబాద్ సిటీ : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది జిల్లాలో ప్రముఖ రెస్టారెంట్లు, హోటాళ్ల తీరు. ప్రజల ఆరోగ్యం పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపని పలు హోటళ్ల యాజమాన్యాలు నిలువ ఉంచిన, కుళ్లిన మాంసాన్ని వండి ఆకర్షణీయమైన రంగులతో ప్రజలను మోసం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్ల పరిస్థితి ఇలానే ఉంది. శనివారం నిజామాబాద్ నగరంలోని కల్తీ ఫుడ్ పై అధికారులు కొరడా ఝులిపించారు. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు, కంట్రోలర్ నగరంలోని పలు

హోటళ్లపై దాడులు నిర్వహించారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డు వద్ద గల అరోమా రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అరోమా రెస్టారెంట్ వంటశాలను పూర్తిగా పరిశీలించారు. ఈ దాడిలో నిలువ ఉంచిన చికెన్, ఫిష్ మాంసం, కలరు వాడిన బిర్యాని, అధికారులు స్వాధీనం చేసుకుని చెత్తబుట్టలో వేశారు. అదేవిధంగా నగరంలోని పలు రెస్టారెంట్లను కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు.

Next Story