అధికారం కోల్పోయి బీఆర్​ఎస్​ నేతల తప్పుడు ప్రచారం

by Sridhar Babu |
అధికారం కోల్పోయి బీఆర్​ఎస్​ నేతల తప్పుడు ప్రచారం
X

దిశ, ఆర్మూర్ : అధికారం కోల్పోయి బీఆర్​ఎస్​ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్, కోటార్మూర్ లలో 44, 63 జాతీయ రహదారుల జంక్షన్ రోడ్డు వద్ద రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లకు స్థానిక ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు పట్టు శాలువాలతో పూల మాలలతో ఘన స్వాగతం పలికారు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించడానికి వెళ్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లకు మార్గమధ్యలో ఆర్మూర్ నాయకులు ఘనంగా సత్కరించి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమల తరలింపుతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, అధికారం కోల్పోయిన నాయకులు, ప్రతిపక్ష బీజేపీ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సౌత్ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. నిరుపేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరిచేందుకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, నిజాంసాగర్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యాల్ల సాయి రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిబాబాగౌడ్, మండల అధ్యక్షుడు ఎస్కే. చిన్నారెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ లు కశ్యప్ స్వాతి సింగ్ బబ్లు, పండిత్ వినీత పవన్, మాజీ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, ఆర్మూర్ మాజీ సర్పంచ్ కొంగి సదాశివ్, కాంగ్రెస్ నాయకులు జిమ్మి రవి, కందేశ్ సత్యం, ఎన్వీ రవీందర్ రెడ్డి (చిట్టి), తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed