- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దశాబ్ది ఉత్సవాలు దేనికి.. టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి
దిశ, భిక్కనూరు : దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే తప్ప, ఏం ఉద్ధరించారని ఉత్సవాలు జరుపుతున్నారని టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భిక్కనూరు మండల కేంద్రంలోని పోతుల గుట్ట వద్ద 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ సబ్ స్టేషన్ మంజూరు చేయించడం వల్లే వ్యవసాయ బావుల వద్ద లో వోల్టేజీ సమస్య తీరిందని, తద్వారా మోటార్లు కాలిపోకుండా పనిచేస్తుండడం పట్ల రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.
ఆ విధంగా జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా క్షీరాభిషేకం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షులు తాటిపాముల లింబాద్రి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందె దయాకర్ రెడ్డి, బంజర్ల నర్సింగ్ రావు, మాజీ అధ్యక్షులు తాటిపాముల సిద్దా గౌడ్, బైండ్ల దశరథం, దుంపల మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి సంతోష్ రెడ్డి, భరత్ రెడ్డి, తిరుపతి గౌడ్, సామ రాకేష్ రెడ్డి, రాజు, మద్దూరి రవి, రాజు, మద్దూరి రవి, ధ్యాగల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.