ప్రతి పౌరుడు నిజాయితీగా ఓటు వేయాలి

by Disha Web Desk 15 |
ప్రతి పౌరుడు నిజాయితీగా ఓటు వేయాలి
X

దిశ, కామారెడ్డి : 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు తన ఓటును నిజాయితీగా వేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న రాశి వనంలో మంగళవారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వీప్​ కార్యక్రమంలో భాగంగా ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని తెలిపారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో

అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో మతాలకతీతంగా ఓటు వేయాలన్నారు. ఓటు వేయడం ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించాలని సూచించారు. అనంతరం ఓటర్ సెల్ఫీ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులతో, వాకర్ అసోసియేషన్ ప్రతినిధులతో సెల్ఫీ దిగారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి వెంకటేష్, జిల్లా అధికారులు రాజారాం, వరదారెడ్డి, వెంకట్ రెడ్డి, సాయిలు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు లింగం, బాలయ్య, శంకర్, రాజ్ గంభీర్ రావు, ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకం

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని, రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును ట్రాన్స్ జెండర్లు సంపూర్ణంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ... ఓటు వేయడానికి వెళితే అందరూ తమని చులకనగా చూస్తారన్న అపోహ విడనాడి, ఓటు ప్రాముఖ్యతను తెలుసుకొని ధైర్యంగా ఓటు వేయాలని అన్నారు. జిల్లాలో సుమారు 30 మందికి పైగా ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారని,

గత శాసనసభ ఎన్నికల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని ప్రశంసించారు. ఇంకా ఎవరైనా ఓటరుగా మిగిలి ఉంటే వెంటనే ఓటరు హెల్ప్ లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని, ఈనెల 25 న ఓటరు తుదిజాబితా విడుదల చేస్తామన్నారు. ఓటింగ్ లో పాల్గొనడంపై అవగాహన కలిగి ఉండడంతో పాటు తోటి వారిలో చైతన్యం తెచ్చి మే13 న జరిగే పోలింగ్ లో వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి బావయ్య, స్వీప్ నోడల్ అధికారి వెంకటేష్, ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed