మా పొట్ట కొట్టకండి సారూ...

by Sridhar Babu |
మా పొట్ట కొట్టకండి సారూ...
X

దిశ, కామారెడ్డి : మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా తమ బతుకులు ఉండగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టడంతో ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టినట్టు అవుతుందని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్లు మంగళవారం కామారెడ్డి- రామారెడ్డి రోడ్డుపై గర్గుల్ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టడంతో ఆటోల్లో ఎవరూ ఎక్కడం లేదన్నారు. దీంతో తాము రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రోజూ ఆటో నడిస్తే తప్ప తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించి తమకు నెలకు 15 వేల రూపాయల జీవన భృతి చెల్లించాలని కోరారు. లేదా తమకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోలో స్వామి గౌడ్, రాజిరెడ్డి, నారా గౌడ్, సంజీవ చారి, శంకర్, శ్రీనివాస్, సాయికుమార్, చందు, హరీష్ యాదవ్, లింగం, చిరంజీవి, శివరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story