మార్పు అంటే మంజూరు నిధులు రద్దు చేయడమా ?

by Sridhar Babu |
మార్పు అంటే మంజూరు నిధులు రద్దు చేయడమా ?
X

దిశ, భీంగల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు తెస్తుందని ప్రజలను నమ్మబలికి గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నింటిని రద్దు చేస్తోందని, మార్పు అంటే మంజూరు అయిన నిధులను రద్దు చేయడమేనా అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుండి ఉపాధి కోసం యువత గల్ఫ్ దేశాలకు వెళ్తారని, అలాంటి యువతకు ట్రేడ్ పనులు నేర్పి గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాక్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను మంజూరు చేస్తే వాటిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఇప్పటికే ఆ స్కిల్ సెంటర్లకు భూమి కేటాయింపు, పనుల టెండర్ ప్రక్రియ

పూర్తి అవ్వడమే కాకుండా పనులకు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ లో మోర్తాడ్ మండల కేంద్రం, ఉమ్మడి కరీంనగర్ లో ఎల్లారెడ్డి పేట్ లల్లో రూ.5 కోట్లతో మంజూరు అయ్యాయని వాటిని రద్దు చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. వీటినే కాకుండా ఆర్ అండ్ బీ ద్వారా పీఆర్ ద్వారా కేటాయించిన రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జి ల నిధులను, కులసంఘాల, గ్రామ సంఘాలతో పాటు మందిరాలు, మసీదులు, చర్చ్ లకు మంజూరు చేసిన నిధులను కూడా రద్దు చేసే యత్నం చేస్తున్నారని ఆరోపించారు.. కాబట్టి ఆయా గ్రామాల యువత, ప్రజలు, కుల సంఘాలు, వీడీసీ సంఘ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిధులను రద్దు చేయకుండా కాపాడుకునేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని సూచించారు.

Advertisement

Next Story