ఆర్మూర్ మున్సిపల్ లో అనుమతులు లేకుండా నిర్మాణాలు..

by Sumithra |
ఆర్మూర్ మున్సిపల్ లో అనుమతులు లేకుండా నిర్మాణాలు..
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీలో గల ఓ ప్రధాన ఆసుపత్రి లైన్లో బహుళ అంతస్తులు నిర్మాణం అనుమతులు లేకుండానే అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా ఆర్మూర్లో దర్జాగా కొనసాగుతున్నాయి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పలు అక్రమ నిర్మాణాల పై ఫిర్యాదులు చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల చర్యల పట్ల ఆర్మూర్ ప్రజలు విమర్శిస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అనుమతులు లేకుండా దర్జాగా అక్రమ నిర్మాణాలు అధికారుల కనుసన్నల్లో వారి అండ దండలతోనే జరుగుతున్నట్లు, ఆర్మూర్ లో ఏ నోట విన్న పుకార్లు షికార్లు మారుతున్నాయి. జర్నలిస్ట్ కాలనీలోని ఓ ఆసుపత్రిలో ప్రక్కన మూడు నెలలుగా ఓ ఇంటి నిర్మాణం పై పలువురు ఫిర్యాదు చేస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని, అధికారుల తీరు పట్ల ఆర్మూర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇంటి నిర్మాణం పై మున్సిపల్ అధికారుల ఈ తీరుగా మౌనం ప్రదర్శిస్తుండడం పట్ల ముడుపులను అధికారుల అందుకున్నారా.. లేదా అధికారుల పనితీరు పై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే చర్చ ఆర్మూర్ ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఆర్మూర్ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ నిర్మాణం పై చర్యలు ఎందుకు అధికారులు తీసుకోవడం లేదని చర్చ ఆర్మూర్ ప్రజల్లో తీవ్రంగా జరుగుతుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పేరును బద్నాం చేస్తూ ఆయన పేరును వాడుకొని అక్రమ నిర్మాణాలకు ఎమ్మెల్యే వ్యక్తిగత అసిస్టెంట్ (పీఏ) ఆజ్యం పోస్తున్నట్లు ఆర్మూర్ లో జనం మాట్లాడుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత నాయకుల పై ఉంటుంది. కానీ ఆ నాయకుల దగ్గర పనిచేసే వ్యక్తిగత పీఏ ఆ నాయకుడి పేరు చెబుతూ ప్రతిపనిలో తన చేతివాటం ప్రదర్శిస్తుండడం పట్ల ఆర్మూర్ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారుల, నాయకుల అండదండలు ఉంటే అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఉండాల్సిన అవసరం లేదా అనే ప్రశ్నను ఆర్మూర్ ప్రజలు చర్చించుకుంటున్నారు. సామాన్య ప్రజలకు మాత్రం నానా రకాల ఇబ్బందులకు గురిచేసి అధికారులు తమ జులుం చూపిస్తూ వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. మరి ఇలాంటి అక్రమ నిర్మాణం పై, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడి అండదండలు కలిగిన ఆ ఇంటి పై అధికారులు ఏ తీరుగా చర్యలు తీసుకుంటారని ఆర్మూర్ జనం ఎదురుచూస్తున్నారు.

Next Story

Most Viewed