మిషన్ భగీరథ నీటిలో రక్తం పీల్చే జలగలు

by Mahesh |
మిషన్ భగీరథ నీటిలో రక్తం పీల్చే జలగలు
X

దిశ, కోటగిరి: గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి తాగునీరు అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం నేడు ప్రజల పాలిట శాపంగా మారింది. కోటగిరి మండల కేంద్రంలో బుధవారం ఉదయం మిషన్ భగీరథ నీటిలో జలగ రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా చాలాసార్లు మిషన్ భగీరథ నీటిలో జలగలు, కలుషిత నీరు వస్తున్నాయని పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదని ప్రజల ఆవేదన చెందుతున్నారు. కలుషితమైన నీరు తాగడం వల్ల వాంతులు విరేచనాలతో చాలా మంది ఆసుపత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story