అభివృద్ధిలో అన్ని వర్గాలు ముందంజ.. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

by Vinod kumar |
అభివృద్ధిలో అన్ని వర్గాలు ముందంజ.. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
X

దిశ, కామారెడ్డి రూరల్: అహింస మార్గంలో, కేంద్రంలో ఉన్న అన్ని పార్టీలను ఒప్పించి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి రాష్ట్రాన్ని సాందించిన నాయకుడు కేసీఆర్ అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. బీఆరేస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని కేవిఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలను కలుపుని అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు.

దేశ సంపదను ఇతరులకు దోచి పెడుతున్న ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. 55 ఏళ్లలో జరగని అభివృద్ది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిందన్నారు. యాసంగిలో పండిన వరి ధాన్యానిను కేంద్ర ప్రభుత్వం కొనకున్నా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు రానున్న రోజుల్లో మానేర్ డ్యాం నుండి సాగు నీరు రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమి ఛైర్మన్ ముజీబుద్దిన్, జిల్లా ఇంఛార్జి, ఎమ్మెల్సీ దండే విఠల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story