ఏసీబీ వలలో అగ్రికల్చర్ అధికారి

by Sridhar Babu |
ఏసీబీ వలలో అగ్రికల్చర్ అధికారి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్/బిచ్కుంద : కామారెడ్డి జిల్లాలో అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మంగళవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల వ్యవసాయాధికారి పోచయ్య గంగాధర్ అనే ఫర్టిలైజర్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. బిచ్కుంద మండలంలో ఫర్టిలైజర్ షాప్ నిర్వహిస్తున్న గంగాధర్ దుకాణంను ఇటీవల అధికారులు తనిఖీ చేశారు. అందులో తేడాలున్నాయని కేసు నమోదు కాకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో బాధితులు నిజామాబాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆదేశాల మేరకు బాధితులు గంగాధర్ ఏవో పోచయ్య మధ్యవర్తి ద్వారా రూ.10 వేల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు తమ ప్రతాపం చూపుతున్నారు. గడిచిన రెండు నెలల కాలంలో నాలుగు ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి.

Next Story

Most Viewed