- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వామ్మో... ఎంత పెద్ద టేలర్..
దిశ, భిక్కనూరు : 10 కాదు 20 కాదు.. ఏకంగా 240 టైర్లు ఉన్న భారీ టేలర్ ను చూసి, వామ్మో... ఇంత పెద్ద వాహనమా అంటూ రహదారి పై ప్రయాణం చేసేవారు ఆశ్చర్యంగా చూశారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర కు పవర్ గ్రిడ్ యంత్రాన్ని తీసుకెళ్తున్న వాహనం బుధవారం భిక్కనూరు టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. హైవే వెళ్లడానికి అన్ని శాఖల అనుమతులు పొందిన ఆ భారీ వాహనం కోసం, టోల్ ప్లాజా వద్ద ఉన్న టోల్ బూతులను కూడా తొలగించడమే కాకుండా, టోల్ ప్లాజా అని ఉన్న పెద్ద బోర్డును సైతం తొలగించేశారు.
ఈ భారీ వాహనం ప్లాజా దాటి వెళ్ళేందుకు కొంత సమయం పట్టడంతో ట్రాఫిక్ కు స్వల్ప అంతరాయం తప్పలేదు. ప్లాజా దాటి వెళ్లేవరకు రహదారి పై వెళ్లే ప్రయాణికులతో పాటు, ఆ వాహనాన్ని చూసేందుకు చుట్టుముట్టు గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఈ భారీ వాహనం వెంట మూడు ఎక్స్ ట్రా లారీలతో పాటు ముందు వెనకాల ఎస్కార్ట్ వాహనాలను కూడా ఉన్నాయి.