Breaking News : 44 నేషనల్ హైవేపై చిరుత.. షాక్ అయిన వాహనదారులు

by M.Rajitha |
Breaking News : 44 నేషనల్ హైవేపై చిరుత.. షాక్ అయిన వాహనదారులు
X

దిశ, వెబ్ డెస్క్ : 44 నేషనల్ హైవే(44 National HighWay)పై చిరుత(Leopord) కనబడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కామారెడ్డి(Kamareddy) జిల్లా సదాశివనగర్ మండలం చంద్రాయనపల్లి - దగ్గి గ్రామాల మధ్య 44వ జాతీయ రహదారిపై ఓ చిరుత కనబడింది. తీవ్ర గాయాల పాలైన చిరుత కాసేపు రోడ్డుపై కూర్చిండిపోయింది. కొద్దిసేపటి తరువాత అది పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోయింది. కాగా నడిరోడ్డు మీద చిరుతను చూసిన ప్రయాణికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed