Lonka Tanda Bridge : కూలిన లొంక తండా వంతెన...బస్సు సౌకర్యం బంద్...

by Kalyani |
Lonka Tanda Bridge : కూలిన లొంక తండా వంతెన...బస్సు సౌకర్యం బంద్...
X

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లొంక తండా గ్రామం శివారులో గల బ్రిడ్జి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆదివారం రాత్రి సమయంలో వంతెన కూలిపోయింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… వర్షాల కారణంగా బ్రిడ్జి మొత్తం కుంగిపోయి ఉందని, అంతేకాకుండా బ్రిడ్జి కూలిపోయిందని గ్రామస్తులు తెలపడం జరిగింది. వంతెన కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజాంబాద్ నుంచి గాంధారి వచ్చే బస్సు మార్గం బంద్ చేయబడింది. అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Next Story

Most Viewed