పదేళ్ల పోరాటంతో మరణ శిక్ష తప్పింది..

by Sumithra |   ( Updated:2023-02-10 16:50:08.0  )
పదేళ్ల పోరాటంతో మరణ శిక్ష తప్పింది..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బ్రతుకుతెరువు కొరకు దుబాయ్ వెళ్లి అక్కడ చేయని నేరానికి ఉరిశిక్ష పడిన పదేళ్లుగా జైలు జీవితం అనుభవించిన వ్యక్తి హతుని కుటుంబానికి పరిహరం ఇచ్చి లేటర్ తో శిక్షను తప్పించుకున్నారు. పదేళ్లుగా కన్నతల్లి లాంటి ఉరుకు దూరమై, భార్య పిల్లలు ఇక తిరిగి రాడేమోనని పది సంవత్సరాలుగా దేశం కాని దేశంలో జరిపిన న్యాయ పోరాటంతో న్యాయస్థానం ద్వార క్షమా భిక్ష మంజూర్ కావడంతో బతికి బట్టకట్టిన వ్యవహరం ఇది.

నిజామాబాద్ జిల్లా మెండోర మండలానికి చెందిన మకూరి శంకర్ గత 17 సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువు కొరకు దుబాయ్ వెళ్లాడు. దుబాయిలో పుజిర స్టేట్ లో ఒక చిన్న కంపెనీలో ఫోర్ మెన్ గా పని కోసం వెళ్ళాడు. అతను దుబాయ్ కి వెళ్తున్న సమయంలో అతని భార్య గర్భంతో ఉంది. ఆ తర్వాత అతనికి కొడుకు జన్మించాడు. మూడు సంవత్సరాల తర్వాత సెలవులలో తిరిగి రావాల్సిన శంకర్ అనుకోకుండా అదే కంపెనీలో పని చేస్తున్న రాజస్థాన్ కు చెందిన రామవతార్ కుమావత్ అనే వ్యక్తి ఆరంతస్తుల పై నుండి పడి ప్రమాదవశత్తు మరణించాడు.

రామవతార్ కుమవత్ పని చేస్తున్న సైట్ కి ఫోర్ మన్ గా శంకర్ పనిచేస్తున్నాడు, ఆ కంపెనీ ఓనర్ ఎక్కడ తన మీద పడుతుందోనని ఆ నేరం శంకర్ పైన వేసి తప్పించుకున్నాడు. చేయని నేరానికి శిక్ష ఎందుకు వేస్తున్నారని పలుమార్లు కోర్టుకు విన్నవించిన దానికి సరైన ఆధారాలు కావాలంటూ పట్టించుకోలేదు అక్కడ న్యాయస్థానం. దీనికి తోడు పోలీసులు బలవంతంగా ఈ నేరం నువ్వే చేసావని ఒప్పుకోవాలని కఠిన ఆంక్షలు పెట్టి ఒప్పించడంతో అతను ఒప్పుకోవడంతో దుబాయ్ కోర్టు 2013 లో శంకర్ కు మరణశిక్ష విధించింది. గల్ప్ దేశాలలో ఉన్న న్యాయ చట్టాలు కఠినంగా ఉండగా బాధితుని కుటుంబం నుంచి క్షమాబిక్ష లెటర్ ఇస్తే మరణ శిక్ష నుంచి బయటపడవచ్చు అని కోర్టు నిర్దేశిస్తే, శంకర్ భార్య భూదేవి గతంలో ఇలాంటి సమస్యలను పరిష్కరించిన దేగాం యాదగౌడ్ ని కలిసి ఎలాగైనా తన భర్తను కాపాడాలని ఆశ్రయించింది.

తెలుగు దేశం పార్టి నిజామాబాద్ పార్లమెంట్ కన్వినర్ గా ఉన్న యాద గౌడ్ తనకున్న సంబంధాలతో దుబాయిలో ఉన్న లాయర్ అనురాధతో సంప్రదింపులు జరిపారు. శంకర్ మరణశిక్ష రద్ధు కావాలంటే హతుని కుటుంబ సభ్యుల క్షమాబిక్ష లేటర్ కావాలని తెలుపడంతో రాజస్థాన్ లోని రామవతార్ కుమవత్ కుటుంబానికి వెతికి పట్టుకొని దాదాపుగా నాలుగుసార్లు ఆర్మూర్ నుండి రాజస్థాన్ కి పోయి వారిని ఓప్పించి చివరగా వారి కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేస్తానని ఒప్పందం చెశారు. దశాబ్ధకాలంగా దుబాయ్ జైలులో ఉన్న శంకర్ కుటుంబం అర్థికంగా చితికి పోవడంతో ఐదు లక్షలు చందాల రూపంలో సేకరించి బాధిత కుటుంబానికి సెప్టెంబర్ నెలలో ఆ కుటుంబానికి డిడి రూపంలో ఇచ్చి ఆ కుటుంబ సభ్యుల క్షమాభిక్ష లెటర్ తీసుకున్నారు. ఆ వెంటనే ఆ పేపర్లన్నీ పుజిరా జైలుకి లాయర్ అనురాధ కి పంపడం ద్వారా కోర్టులో సబ్మిట్ చేస్తే అతనికి శిక్ష ను రద్ధు చేసింది దుబాయ్ కోర్టు. వారం రోజుల క్రితం అవుట్ జైలు నుంచి టికెట్ ఇచ్చి ఇండియాకు పంపడం జరిగింది శంకర్ శుక్రవారం నిజామాబాద్ చేరుకోవడం జరిగింది. శంకర్ అతని కుటుంబం గ్రామ ప్రజలు రాజస్థాన్ వాసి గోయాంక, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, దేగాం యాదగౌడ్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story