Central Jal Shakti Abhiyan : నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర జల శక్తి అభియాన్ టీం..

by Sumithra |   ( Updated:2024-07-18 15:36:50.0  )
Central Jal Shakti Abhiyan : నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర జల శక్తి అభియాన్ టీం..
X

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టును కేంద్ర జలశక్తి అభియాన్ టీం గురువారం సందర్శించి పరిశీలించారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టు పుట్టు పూర్వోత్తరాలను నీటి పారుదల శాఖ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం పూర్తి వివరాలను సేకరించారు. భూగర్భ జలాలు పెంపునకు, వర్షపు నీటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి అభియాన్ డిప్యూటీ సెక్రటరీ, కేంద్ర విద్యుత్ శాఖ డిప్యూటీ కరుణాకరన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి అధికారి కేంద్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ జూనియర్ సైంటిస్ట్ అధర్వ శ్రీకృష్ణ పవార్ నీటిపారుదల శాఖ అధికారులు ఈఈ సోలమన్, ఏఈఈ శివప్రసాద్, ఎంపీడీఓ గంగాధర్, ఏఈఓ శ్రీనివాస్, గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed