- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
New Ration Cards: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్.. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) కోసం దరఖాస్తు చేసుకునే వారికి పౌర సరఫరాల శాఖ (Department of Civil Supplies) శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు దరఖాస్తుల స్వీకరణ అంశంలో నెలకొన్న అయోమయానికి తెర దించింది. కొత్త దరఖాస్తులు మీ సేవ (Mee Seva) ద్వారా స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకు సోమవారం సివిల్ సప్లయిస్ భవన్ (Civil Supplies Bhavan)లో మీసేవ అధికారులతో ఆ శాఖ అధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్టు, సభ్యుల యాడ్ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించడానికి మీసేవ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. దీంతో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్‌ను అధికారులు పునరుద్ధరించారు. ఈ పరిణామంతో మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. ఒక్కో దరఖాస్తుకు రూ.50 మాత్రమే వసూలు చేయాలని మీ సేవా నిర్వాహకులకు ప్రభుత్వం ఆదేశించింది.
కాగా, రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్త కార్డులు జారీ ప్రక్రియ మొదలైంది. గతంలో ప్రజాపాలన (Praja Paalana), గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్టలను మంజూరు చేశారు. అయితే, గత మూడు, నాలుగు రోజులుగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. మీ సేవ కేంద్రాల్లో కొత్త కార్డులకు అప్లయ్ చేసుకోవాలని ఈనెల 7 సివిల్ సప్లయ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, అదే రోజు రాత్రి 8 గంటలకు మీ సేవ పోర్టల్‌లో కొత్త రేషన్ కార్డులకు ఆప్షన్ కూడా కనిపించింది. మరుసటి రోజు ప్రజలు భారీగా మీ సేవ కేంద్రాలకు బారులు తీరారు. కానీ, ఆ వెంటనే మీసేవ పోర్టల్‌లో కొత్త రేషన్ కార్డు ఆప్షన్‌ను తొలగించారు. ఇందేటని వారిని ప్రశ్నించగా.. ప్రభుత్వమే పోర్టల్‌లో ఆప్షన్ తొలగించిందని మీసేవ నిర్వహకులు సమాధానం ఇవ్వడంతో ప్రజలు నిరాశగా వెనుదిరిగారు. తాజాగా, మీ సేవలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించనున్నట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు.