- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు.. చివరికి

వెబ్ డెస్క్ : భార్య వేధింపులు తాళలేక మరో భర్త తనువు చాలించాడు. వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని ఖోర్దా జిల్లాలో చోటు చేసుకుంది. కుంభార్‌బస్తాకు చెందిన రామచంద్ర బర్జెనాకు రెండేళ్ల కిందట రూపాలితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె సంతానం. పెళ్లి నాటి నుంచి భార్య తనను మానసికంగా హింసిస్తున్నదని రామచంద్ర ఆరోపించాడు. తన భార్య కారణంగా తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు వీడియో రికార్డ్ చేశాడు. నిజిగఢ్-తపాంగ్ రైల్వే ట్రాక్ దగ్గర రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రామచంద్ర తల్లి ఫిర్యాదు చేయగా..రూపాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే రామచంద్ర రూపాలికి 20 లక్షల ఎదురు కట్నం ఇచ్చిపెళ్లి చేసుకున్నాడని తల్లి తెలిపింది. పెళ్లి అయినప్పటి నుంచి తన కుమారుడిని కోడలు రూపాలి వేధిస్తున్నదని ఆరోపించింది. పెళ్లి ఖర్చులన్నీ తామే భరించామని తెలిపింది. అయితే తన కొడుకుతో కోడలు తరచుగా గొడవ పడి పుట్టింటికి వెళ్తుందని పేర్కొంది. అతడిని మానసికంగా వేధిస్తుందని,భార్య వేధింపులు తాళలేక తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.