Breaking news : తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ

by M.Rajitha |   ( Updated:2024-11-17 12:05:11.0  )
Breaking news : తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రేపటి నుంచి నూతన ఎలక్ట్రిక్ వెహికిల్స్ పాలసీ (New EV Policy) అమలులోకి రానుంది. ఆదివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) కొత్త పాలసీ వివరాలు ప్రకటించారు. రాష్ట్రంలో ఇకపై కొనుగోలు చేసే అన్ని ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు. జీవో 41 ద్వారా తీసుకువచ్చిన ఈ కొత్త పాలసీ 2026, డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుందని అన్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఆటో, ట్రాన్స్పోర్ట్ బస్సులకు వందశాతం రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందని.. దీనిద్వారా వినియోగదారులకు ఏడాదికి రూ.లక్ష వరకు ఆదా అవుతుందని అన్నారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ నగరం కాలుష్యం కాకూడదనే ఉద్దేశంతో ఈవీ పాలసీని ప్రవేశ పెడుతున్నామని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న మూడు వేల బస్సులు స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే సిటీలో మొత్తం ఈవీ ఆర్టీసీ బస్సులు నడుస్తాయని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed