నవ వధువు కిడ్నాప్ కలకలం

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-25 06:49:09.0  )
నవ వధువు కిడ్నాప్ కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో వధువును బంధువులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. కొండగట్టులో పెళ్లి చేసుకుని హన్మకొండకు కొత్త జంట వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హుజురాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కారు ఆపి.. వధువును బంధువులు తీసుకెళ్లారు. వరుడిపై వధువు బంధువులు దాడి చేశారు. మొత్తం 15 మంది ఒక్కసారిగా కారుపై దాడికి పాల్పడి అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అబ్బాయిది హన్మకొండ కాగా అమ్మాయిది మడికొండగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed