Nandanavanam : 'నంద‌నవ‌నం' అర్హుల‌కు న్యాయం చేయాలి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

by Ramesh N |
Nandanavanam : నంద‌నవ‌నం అర్హుల‌కు న్యాయం చేయాలి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నందనవనం లబ్దిదారులకు తెలంగాణ సర్కార్ శుభవార్త వెల్లడించింది. ఈ మేరకు రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం x ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్.బీ.న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని నంద‌న‌వ‌నంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మించిన ఇండ్ల‌ను అక్ర‌మంగా ఆక్ర‌మించుకున్న‌వారిని త‌క్ష‌ణం ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించినట్లు Minister Ponguleti Srinivas Reddy తెలిపారు. ''నంద‌నవ‌నం'' Nandanavanam ఆక్ర‌మ‌ణ‌దారుల తొల‌గింపునకు చర్యలు చేపట్టి.. అర్హుల‌కు న్యాయం చేయాలని పేర్కొన్నారు.

బుధ‌వారం స‌చివాల‌యంలో మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని మంకాల్, నంద‌న‌వ‌నంలో ఉన్న ఇండ్ల స‌మ‌స్య‌, కేటాయింపుపై అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించినట్లు వెల్లడించారు. ఈ స‌మావేశంలో హౌసింగ్ సెక్ర‌ట‌రీ జ్యోతి బుద్ధ‌ప్ర‌కాష్‌, ప్ర‌జావాణి నోడ‌ల్ ఆఫీస‌ర్ డి. దివ్య‌, ప్ర‌స్తుత రంగారెడ్డి క‌లెక్ట‌ర్ నారాయ‌ణ‌రెడ్డి, గ‌తంలో రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్లుగా ప‌నిచేసిన డాక్ట‌ర్ ఎస్. హ‌రీష్‌, కె. శ‌శాంక్ త‌దిత‌రులు పాల్గొన్నట్లు ట్వీట్‌లో తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed