Nalsar University: నల్సార్ యూనివర్సిటీ ఆన్‌లైన్, దూరవిద్య కోర్సులపై నిషేధం విధించిన యూజీసీ..!

by Maddikunta Saikiran |
Nalsar University: నల్సార్ యూనివర్సిటీ ఆన్‌లైన్, దూరవిద్య కోర్సులపై నిషేధం విధించిన యూజీసీ..!
X

దిశ, వెబ్‌‌డెస్క్: హైదరాబాద్(HYD) నల్సార్ యూనివర్సిటీ(Nalsar University) గత కొన్ని ఏళ్ల నుంచి ఆన్‌లైన్(Online), దూరవిద్య(Distance Education)లో వివిధ రకాల కోర్సులను అందిస్తున్న విషయం తెలిసిందే. చాలా మంది గవర్నమెంట్(Govt), ప్రైవేట్(Private) ఉద్యోగులతో పాటు ఇతరులు కూడా ఆ కోర్సుల్లో అడ్మిషన్(Admission) తీసుకొని చదువుకుంటున్నారు. అయితే ఆ కోర్సులపై నిషేధం విధిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం(2024-25)లో నల్సార్ వర్సిటీ అందించే ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్(ODL) కోర్సుల్లో ఎవరు అడ్మిట్ కావొద్దని హెచ్చరించింది. రూల్స్ పాటించకపోవడం, ఆ కోర్సులపై యూజీసీ అడిగిన ప్రశ్నలకు నల్సార్ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఈ నిషేధం విధించినట్లు తెలుస్తోంది. నిషేధం ముగిసిన తర్వాత ఆ కోర్సులకు మళ్లీ అప్లై(Apply) చేసుకోవచ్చని యూజీసీ వెల్లడించింది. నిషేధం విషయంపై నల్సార్ వైస్ ఛాన్సలర్(VC) శ్రీకృష్ణదేవరావు(Shrikrishna Deva Rao)ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు.

Advertisement

Next Story