- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాలి : కోదండరాం
దిశ, సూర్యా పేట ప్రతినిధి: నిరంకుశ అప్రజాస్వామిక అవినీతి కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి మూడవ రాష్ట్ర ప్లీనరీ లో ఆయన మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోగా అన్ని రంగాల్లో తెలంగాణ విలువలు దిగజారిపోతున్నాయని ఆయన విమర్శించారు. ఇలాంటి నియంతృత్వ ముఖ్యమంత్రిని గద్దె దింపుట కొరకు సామాజిక ప్రజా స్వామిక తెలంగాణ నిర్మాణం కొరకు జన సమితి ఎన్నికల్లో రంగం సిద్ధం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ ఎదుర్కొనే స్థితిలో లేవని బీజేపీ కేసీఆర్ పట్ల రాజకీయ స్వార్థంతో కూడుకున్న ఉదార వైఖరితో వ్యవహరిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు వ్యూహం రూపొందించుకోవడంలో విఫలమవుతుందని ఆయన అన్నారు. సామాజిక ప్రజాస్వామిక శక్తులను పౌర సమాజాలతో సరికొత్త అలయన్స్ రూపొందించి కేసీఆర్‌ను ఓడగోడతామని తెలిపారు. తెలంగాణ జన సమితి ఖచ్చితంగా స్వతంత్ర ఉనికితో నిలబడి, కల బడుతుందని తెలంగాణ జన సమితి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని పార్టీ నిర్ణయించిన సీట్లలో అభ్యర్థుల గెలుపు కొరకు పోరాడాలని పిలపునిచ్చారు.
రాజకీయాలను వ్యాపారం చేసి ఆర్థిక, రాజకీయాన్ని కలగలుపు చేసుకున్నటువంటి కేసీఆర్ దుష్టపాలనను అంతమోoదిoచాలని అన్నారు. ప్లీనరీలో పలు అంశాలపై పార్టీ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాలను ప్రతినిధులు ఆమోదించారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు పిఎల్ విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శులు అంబటి శ్రీనివాస్, గోపగాని శంకర్రావు ముఖ్యరాజు ఆశప్ప నిజ్జన రమేష్,యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సలీం పాషా, విద్యార్థి సమితి నాయకులు అరుణ్ సర్దార్, వినోద్, నారబోయిన కిరణ్, గట్ల రమా శంకర్, మల్లయ్య యాదవ్, వినయ్, శ్రీనివాస్, యాకోబు రెడ్డి, గోవర్ధన్, కొల్లు కృష్ణారెడ్డి, గోపి, సూర్యనారాయణ, బంధన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.