- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మతిస్థిమితం ఉంది..కనిపించడం లేదు
by Naveena |

X
దిశ, నూతనకల్ : మండల కేంద్రానికి చెందిన ఇరుగు నరసమ్మ భర్త వీరయ్య (75) అనే వృద్ధురాలు అదృశ్యమైనట్లు ఎస్సై మహేంద్రనాథ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..నరసమ్మ రోజులాగే ఒక్కరే ఇంట్లో ఉంటుంది. వయసు రీత్యా మతిస్థిమితం సరిగా లేనందున గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికిన దొరకకపోవడంతో, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు నెంబర్లకు 8712686037, స్టేషన్ 8712658180 సమాచారం ఇవ్వాలని కోరారు.
Next Story