- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA Vemula Veeresham : పనులు లేక ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారు...
దిశ ,నార్కట్ పల్లి : ప్రతిపక్షాలకు పనులు లేక ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వెంటనే వాటిని మానుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని గమనించాలన్నారు. నార్కట్ పల్లి మండల పరిధిలోని వరలక్ష్మి కాటన్ మిల్లులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు తెలిపారు. ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తేమ శాతంలో ఇబ్బందులు కలిగాయని, దీంతో కాంటాలకు ఆలస్యం జరిగిందన్న విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలన్నారు. రైతు సమస్యలపై అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలి అన్నారు. కేవలం వారి హయాంలో జరిగిన అవినీతిని కాపాడుకోవడం కోసమే మిల్లర్ల కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యం కోసం 20,000 కోట్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రైతులు సైతం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి సభ్యులు దూదిమెట్ల సత్తయ్య యాదవ్, నాయకులు వడ్డే భూపాల్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, జేరిపోతుల భరత్, తదితర నాయకులు పాల్గొన్నారు.