Budget : జనరంజక బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

by Kalyani |
Budget : జనరంజక బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, పెన్ పహాడ్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో మొదటిసారిగా ప్రవేశపెట్టిన 2 కోట్ల 91 లక్షల 159 వేల బడ్జెట్ జనరంజక బడ్జెట్ గా ఉందని మాజీ మార్కెట్ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తూముల భుజంగరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకన్న అన్నారు. గురువారం వారు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ… ప్రజా పరిపాలన అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని రంగాల్లో చేయూతను అందించేందుకు నూతన బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని అన్నారు. రైతాంగానికి, విద్య గృహ జ్యోతి పథకానికి పేద ప్రజల కోసం ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా ఉందని అన్నారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్షత చూపి బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. రాష్ట్రం నుంచి లక్షల కోట్లు కేంద్రానికి పనులు చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో వివక్షత చూపిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడం కోసం ఇప్పటికే లక్ష రూపాయలు మాఫీని అందించగా మరో రెండు దఫాల్లో రెండు లక్షల లోపు రుణమాఫీని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.



Next Story