- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు
దిశ, మఠంపల్లి : స్నేహితులతో కలిసి గత మూడు రోజుల క్రితం బయటకు వెళ్లిన యువకుడు బుధవారం ఉదయం మఠంపల్లి మండల కేంద్రంలోని పంజాబీ దాబాలోని మురుగుకుంటలో శవమై తేలిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం సారంగపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన గల్లా నతానీలు( 26) గత మూడు రోజుల క్రితం సాయంత్రం తన స్నేహితులతో కలిసి మఠంపల్లి మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న పంజాబీ దాబాలో మద్యం తాగడానికి వచ్చినట్లు తండ్రి ప్రసాదరావుకు తెలిపారు. తన కొడుకు రెండు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో మరుసటి రోజు మఠంపల్లి పోలీస్ స్టేషన్లో సాయంత్రం ఐదు గంటలకు ఫిర్యాదు చేశారు.
తన స్నేహితులతో కలిసి హెచ్ పీ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న పంజాబీ దాబాలో మద్యం తాగారని, ఇప్పటివరకు తన కుమారుడు ఇంటికి రాకపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సై ఇరుగు రవి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం దాబా మురుగు కాలువలో నతానీలు శవమై కనిపించాడు. దాంతో మృతదేహాన్ని హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబికులు మాత్రం స్నేహితులే కొట్టి చంపారని ఆరోపిస్తూ వారిని కఠినంగా శిక్షించాలని మఠంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా మృతుని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
- Tags
- nalgonda