దిశ ఎఫెక్ట్..ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్

by Naveena |
దిశ ఎఫెక్ట్..ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్
X

దిశ, తిరుమలగిరి (సాగర్) : మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు సకాలంలో ప్రారంభించకపోవడంతో ఈ నెల 3వ తారీఖున " మార్కెట్ యార్డులో ధాన్యం.. ఓపెన్ కాని కొనుగోలు కేంద్రాలు " అనే శీర్షికన దిశ పత్రిక ప్రచురించింది. దీంతో మార్కెట్ కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్ తో పాటు సంబందింత అధికారులు స్పందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులతో మాట్లాడి..వెంటనే ఏర్పాటు దిశగా చర్యలు తీసుకున్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ చేతుల మీదుగా మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాని ఆయన ప్రారంభించారు. ఇప్పటికే మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంతో పాటు..తేట్టకుంట గ్రామంలో దొడ్డు రకం ధాన్యానికి సంబందించిన కొనుగోలు కేంద్రాలు మంజూరు అయ్యాయని అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సన్న రకం ధాన్యం కోసం ఐకేపి ఆధ్వర్యంలో.. మండలంలోని కొంపల్లి,నేతపురం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.అదే విధంగా పిఎసియస్ ఆధ్వర్యంలో.. బోయగూడెం,రాజవరం గ్రామాల్లో సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఖరీఫ్ సీజన్ లో ఎక్కువ మొత్తం వందల ఎకరాలలో సన్న రకం ధాన్యాన్ని రైతులు సాగు చేశారు. పండిన ధాన్యాన్ని ట్రాక్టర్ల తో చేరవేస్తున్నారు. తిరుమలగిరి మార్కెట్ యార్డులో దొడ్డు రకం ధాన్యంతో పాటు సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల నుంచి ఒత్తిడి రావడంతో.. అధికారులతో మాట్లాడి సమస్యను తీర్చారు.మార్కెట్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో దొడ్డు ధాన్యంతో పాటు సన్నధాన్యము కూడా కొనుగోలు చేస్తారని రైతులకు హామీ ఇచ్చారు.ఇప్పటికే అధికారులతో మాట్లాడి సమస్యను తీర్చామని తెలిపారు.కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వెళ్లే ధాన్యం తేమ విషయంలో మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నిర్వహకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మార్కెట్ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్ యాదవ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.మిల్లర్లతో మాట్లాడి సమస్యలు తీర్చాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి,వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్ యాదవ్,గడ్డం సాగర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు రమావత్ కృష్ణ నాయక్,శాగం శ్రవణ్ కుమార్ రెడ్డి,శాగం రాఘవరెడ్డి,శాగం నాగిరెడ్డి,ఎమ్మార్వో అనిల్ కుమార్,మార్కెట్ సెక్రటరీ వెంకట్ రెడ్డి,ఏపిఎం నరసింహ,మార్కెట్ డైరెక్టర్లు శాగం మంగమ్మ,పాండు నాయక్,రాములు నాయక్,మత్స్య సహకార సంఘం చైర్మన్ పిట్టల కృష్ణ,మేరావత్ ముని నాయక్,కోడుమూరు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed