- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
accident : హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వెళ్తున్న బస్సు పల్టీ
దిశ,చౌటుప్పల్ టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా నలుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధరావు కథనం ప్రకారం..నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వెళ్తోంది. మండల పరిధిలోని బొర్రోళ్ల గూడెం సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన బొప్పని విజయ,చిట్యాల మండల కేంద్రానికి చెందిన మారుపాక అనిత,నల్గొండ పరిధి నాంపల్లికి చెందిన పూసపాక ఆండాలుతో పాటు బస్సు డ్రైవర్ మైతిగం జానయ్య లు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆర్టీసీ బస్సు డ్రైవర్ అజాగ్రత్త..అతివేగం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ మన్మధ రావు తెలిపారు.బస్సు ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ మన్మధరావు తెలిపారు.