'విద్యార్థులు డ్రగ్స్ కి దూరంగా ఉండాలి..'

by Sumithra |
విద్యార్థులు డ్రగ్స్ కి దూరంగా ఉండాలి..
X

దిశ, నల్లగొండ : తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, నల్గొండ పట్టణంలోని కోమటి రెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ గవర్నమెంట్‌ జూనియర్ కాలేజీలోని జూనియర్ కళాశాల, ఒకేషనల్ జూనియర్ కళాశాలలో విడివిడిగా యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. ఈ అవగాహన కార్యక్రమాలలో నల్గొండ, సూర్యాపేట తెలంగాణా యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ డీఎస్పీ పి.బిక్షపతి రావు మాదకద్రవ్యాల దుర్వినియోగం పరిణామాలు, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల దుష్ప్రభావాలు, డ్రగ్స్ భూతాన్ని పారదోలడంలో తల్లిదండ్రులు, పౌరులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల బాధ్యతలను వివరించింది.

చట్టవిరుద్ధమైన డ్రగ్స్ వినియోగం, రవాణా గురించి ఎవరైనా తెలంగాణ ఆంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908కి సమాచారం ఇవ్వవచ్చని విజ్ఞప్తి చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకు దోహదపడతామని ప్రతిజ్ఞ చేశారు. అవగాహన కార్యక్రమం అనంతరం డ్రగ్స్ పై యాడ్స్ ప్లే చేసి పోస్టర్లు విడుదల చేశారు. అలాగే కొంతమంది విద్యార్థులు స్వచ్ఛందంగా యాంటీ డ్రగ్స్ సోల్జర్స్‌గా చేరారు. ఈ అవగాహన కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మేరుగు రాకేంద్, లెక్చరర్లు, 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ, నల్గొండ వన్ టౌన్‌ పీఎస్‌ ఎస్‌ఐ శంకర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, లెక్చరర్లు, 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


Next Story