siege : అనుమతులు లేని రెండు ఆసుపత్రులు సీజ్

by Kalyani |
siege : అనుమతులు లేని రెండు ఆసుపత్రులు సీజ్
X

దిశ, నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రెండు హాస్పటలను నేరేడుచర్ల మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పున్న నాగిని సీజ్ చేసినట్లు గురువారం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరేడుచర్ల పట్టణంలో హాస్పిటల్స్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, కొందరు వ్యక్తులు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కోటాచలం దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. వారి ఆదేశానుసారం హాస్పిటల్ ను తనిఖీ చేయడం జరిగిందని అన్నారు.

ఈ తనిఖీల్లో జాన్ పహాడ్ రోడ్డులో ఉన్న అమ్మ హాస్పిటల్, శ్రీ సాయి శ్రీనివాస హాస్పిటల్ లో తనిఖీ చేసి ఆ హాస్పిటల్ రిజిస్ట్రేషన్, ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్, డ్యూటీ డాక్టర్స్ వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. హాస్పిటల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీజ్ చేసినట్టు తెలిపారు. ఆసుపత్రులను నిర్వహించే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకొని రోగులకు చికిత్సలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ నరసయ్యలు ఉన్నారు.



Next Story