DISHA EFFECT : “దిశ” కథనానికి ఆర్టీసీ స్పందన

by Naveena |
DISHA EFFECT : “దిశ” కథనానికి ఆర్టీసీ స్పందన
X

దిశ,తుంగతుర్తి: “దిశ” దినపత్రికలో వచ్చిన కథనానికి సూర్యాపేట ఆర్టీసీ అధికారులు స్పందించారు.ఈ మేరకు దాదాపు రెండేళ్ల క్రితం నిలిచిపోయిన సూర్యాపేట-నూతనకల్- చిల్పకుంట్ల-అన్నారం-తుంగతుర్తి-తిరుమలగిరి మీదుగా జగద్గిరిగుట్టకు కు చేరి అక్కడ నుంచి తిరిగి ఇదే మార్గాల గుండా వచ్చే బస్సు సర్వీసును ఆదివారం సాయంత్రం సూర్యాపేట ఆర్టీసీ అధికారులు తిరిగి పునరుద్ధరించారు.ఈ పరిణామంతో పలు గ్రామాల ప్రజలు ఆర్టీసీ సర్వీసును సాదరంగా ఆహ్వానిస్తూ తోరణాలు కట్టి సంబరాలు చేసుకున్నారు.చిల్పకుంట్ల-వెంకేపల్లి-సంగేమ్- అన్నారం- తుంగతుర్తి-పసునూరు-పస్తాల ప్రాంతాలలో ప్రజలు సంతోషాలు వ్యక్తం చేశారు. “విచిత్రంగా మారిన సూర్యాపేట ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి” అనే టైటిల్ ఈనెల 22 సాయంత్రం “దిశ”లో కథనం వెలువడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తుంగతుర్తి- హనుమకొండ బస్సు సర్వీసు రద్దు పై కూడా ఆ కథనం వెల్లడించింది. దీంతో సూర్యపేట ఆర్టిసి డిపో మేనేజర్ సురేందర్ ప్రత్యేకంగా ఆరా తీశారు. దాదాపు రెండేళ్ల క్రితం ఆర్టీసీ అధికారులు సరైన కారణాలు లేకుండానే ఈ బస్సు సర్వీసు ను రద్దు చేశారు.దీంతో దాదాపు 30 గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.ఇదిలా ఉంటే సూర్యాపేట నుంచి ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకు బయలుదేరి నూతనకల్ చిల్పకుంట్ల-తుంగతుర్తి-జగద్గిరిగుట్టకు రాత్రి చేరుకొని అక్కడ తిరిగి ఉదయం 4 గంటలకు ఇదే మార్గాల గుండా డిపోకు చేరుకుంటుందని ఆర్టీసీ అధికారులు “దిశ”కు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed