ఢిల్లీలో పుట్టపాక హ్యాండ్లూమ్స్ ఇక్కత్ వస్త్ర ప్రదర్శన

by Kalyani |
ఢిల్లీలో పుట్టపాక  హ్యాండ్లూమ్స్ ఇక్కత్  వస్త్ర ప్రదర్శన
X

దిశ,సంస్థాన్ నారాయణపురం: నేషనల్ ఫిక్కీ ఫ్లో అనుష్కం వారు ఢిల్లీలో నిర్వహించిన ఎగ్జిబిషన్ లో పుట్టపాక ఉమెన్స్ హ్యాండ్లూమ్స్ ఇక్కత్ ప్రొడక్షన్ సొసైటీ వారు పుట్టపాక చేనేత వస్త్రాలను ప్రదర్శించారు. పుట్టపాకలో తయారైన తేలియా రుమాల్ వస్త్రాలను,సిల్క్ చీరలు, ఫ్యాబ్రిక్స్, డ్రెస్ మెటీరియల్, దుపట్టాలు, డబల్ ఇక్కత్ చీరలు, సికో అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్, మొదలైనవి వస్త్రాలను ప్రదర్శనలో ఉంచి అమ్మకం జరిపారు.

చేనేత వస్త్రాలకు తగు ప్రాధాన్యత ఇస్తూ ఢిల్లీలో వస్త్రాల అమ్మకాలకు అవకాశం కల్పించిన ఫిక్కీ ఫ్లో సభ్యులు మ్రినాలని శాస్త్రి హైదరాబాద్, శీతల్ టిబ్రివాల ఢిల్లీ వారు సహకరించి, ఢిల్లీలో నేషనల్ ఫిక్కీ ఫ్లోలో ఎగ్జిబిషన్ నిర్వహించుటకు అవకాశం ఇచ్చి చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ అవకాశం కల్పించారని పుట్టపాక ఉమెన్స్ హ్యాండ్లూమ్స్ ఇక్కత్ ప్రొడక్షన్స్ సొసైటీ అధ్యక్షులు సామల విజయలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. చేనేత కళాకారులకు పని కల్పించే విధంగా చేస్తున్నందున వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్లో సామల భాస్కర్, హర్షిత్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed