ప్రజా పాలనలో ప్రజలకు లబ్ధి

by Sridhar Babu |
ప్రజా పాలనలో ప్రజలకు లబ్ధి
X

దిశ, నకిరేకల్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజా పాలన ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడ క్యాంపు కార్యాలయంలో రామన్నపేట, కేతేపల్లి మండలాల్లోని 120 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం అందజేసి మాట్లాడారు. సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిది అన్నారు. గత ప్రభుత్వంలో అందించని చెక్కులను ప్రస్తుతం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రభుత్వంలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నారు. నాగార్జునసాగర్ నిండిన తర్వాత పానగల్

నుండి అయిటి పాముల వరకు నీరు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ పది మొక్కలను నాటాలన్నారు. ప్రభుత్వ భూములలో అధిక మొక్కలను నాటడం ద్వారా పర్యావరణానికి లబ్ధి చేకూర్చిన వారం అవుతామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్, రామన్నపేట, కేతేపల్లి, మండల పార్టీ అధ్యక్షులు నకిరేకంటి ఏసు పాదం, సిరిగిరి రెడ్డి మల్లారెడ్డి, కంపసాటి శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed