- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీసీ నాయకుడినని ఓర్వలేకే నన్ను సస్పెండ్ చేశారు : గరిడేపల్లి సైదులు
దిశ, కోదాడ(అనంతగిరి) : అనంతగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీలో అగ్రకుల ఆధిపత్య ధోరణి ఎక్కువగా ఉందని, బీసీలను ఎదగనివ్వకుండా అణగదొక్కేందుకే తనని సస్పెండ్ చేశారని మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు, చనుపల్లి గ్రామ ఉపసర్పంచ్ గరిడేపల్లి సైదులు ఆరోపించారు. 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విస్తృతంగా సేవ చేశానని, కారణం లేకుండానే ప్రెస్ మీట్ లు పెట్టి సస్పెండ్ చేశామని చెబితే సరిపోతుందా అని ప్రశ్నించారు. గురువారం ఆయన దిశతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్ష పదవి నుండి, పార్టీ శాశ్వత సభ్యత్వం నుండి తొలగించామని బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి చెప్పడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్ష, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు పదవి తాము వేసిన భిక్ష అని అగ్రవర్ణ నేతలు ప్రతిసారి పేర్కొనేవారని ఆయన వాపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కావడంతో తన ఎదుగుదలను అణగదొక్కేందుకే ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పార్టీలో కొనసాగేందుకు తాను సిద్ధంగా లేనని, త్వరలో పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిపారు.