- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నార్కట్ పల్లిని సర్వాంగ సుందరంగా మారుస్తా.. చిరుమర్తి లింగయ్య
దిశ, నకిరేకల్ : రాబోయే ఐదేళ్లలో నార్కెట్ పల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తానని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య తెలిపారు. పట్టణంలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టానని గుర్తు చేశారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా పెద్ద చెరువులోకి కృష్ణా జలాలను తీసుకువచ్చి మినీ ట్యాంక్‌బండ్ గా మారుస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే 30 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్ లో నిర్మాణాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయని అన్నారు.
చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక కొంతమంది కేవలం విమర్శలు మాత్రమే చేయడం అలవాటుగా చేసుకున్నారని వారికి బుద్ధి చెప్పాలన్నారు. పెద్ద నాయకులమని చెప్పుకునే వారు ఈ పట్టణానికి ఏం చేశారో తెలపాలన్నారు. మూడోసారి సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉంటున్నానని ఇక్కడే ఇంటిని నిర్మించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పుల్లెంల ముత్తయ్య, మేకల రాజిరెడ్డి, ఉప సర్పంచ్ సిరిపంగి స్వామి, కో ఆప్షన్ సభ్యులు వాజిద్ అలీ తదితర నాయకులు పాల్గొన్నారు.