నా బలం బలగం పార్టీ కార్యకర్తలే : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

by Disha Web Desk 11 |
నా బలం బలగం పార్టీ కార్యకర్తలే : ఎమ్మెల్యే కోమటిరెడ్డి
X

దిశ, మునుగోడు: నాకు పదవులు ముఖ్యం కాదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నా బలం బలగమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండలంలోని 26 గ్రామాల ముఖ్య నాయకులు, బూత్ కమిటీ ఇంచార్జిలు, బూత్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి అన్ని నియోజకవర్గాల కంటే మునుగోడులో అధిక ఓట్లు వేయించాలని ఆయన కార్యకర్తలను అభ్యర్ధించారు. ప్రతి కార్యకర్త ప్రతి రోజు గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.

ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన పదవికి రాజీనామా చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పాటు ప్రభుత్వం దిగి వచ్చిందని గుర్తు చేశారు. తన రాజీనామాతో ఈ ప్రాంతానికి 500 కోట్లు అప్పటి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల్లో ఊబిలో నెట్టారని, కాంగ్రెస్ బలోపితమైనప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్త పైన ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగానే పనిచేయాలి తప్ప కుల మతాల పేరున ఓట్లు అడగొద్దన్నారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 75శాతం పైన ఓట్లు వస్తాయని, వార్ వన్ సైడ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ఈ సమావేశంలో మునుగోడు ఇంఛార్జి సంధ్యా రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత, రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్, డిసిసిబి డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీలు కర్నాటి స్వామి యాదవ్, గుత్తా ఉమా, జెడ్పీటీసీ వీరమల్ల భానుమతి, మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, మాజీ జడ్పీటిసి జాజుల అంజయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు బిమనపల్లి సైదులు, నాయకులు నన్నూరి విష్ణు వర్ధన్ రెడ్డి, బూడిద లింగయ్య యాదవ్, వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, జాల వెంకన్న యాదవ్, అనంత లింగస్వామి గౌడ్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పాల్వాయి జితేందర్ రెడ్డి, పాలకూరి యాదయ్య గౌడ్, మేడి యాదయ్య, చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed