దిశపత్రిక అనతికాలంలోనే అత్యున్నత స్థాయికి చేరుకుంది.. ఎంపీపీ దర్శనాల అంజయ్య

by Disha News Desk |
దిశపత్రిక అనతికాలంలోనే అత్యున్నత స్థాయికి చేరుకుంది.. ఎంపీపీ దర్శనాల అంజయ్య
X

దిశ, అడ్డగుడూర్: అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జెడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్‌లు అడ్డగూడూర్ మండల దిశ రిపోర్టర్ మార్తా రమేష్ ఆధ్వర్యంలో దిశ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దిశ పత్రిక ప్రారంభించిన అనతికాలంలోనే పత్రికా రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ జోసెఫ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూలపెళ్లి జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీ కోఆప్షన్ మెంబర్ ఆంతోని, టీఆర్ఎస్వీ నాయకులు అరవింద్, నిజాం కాలేజ్ టీఆర్ఎస్వీ అధ్యక్షులు అవినాష్, పేతురు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story