'దిశ' పత్రికను ప్రశంసించిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Veldandi saikiran |
దిశ పత్రికను ప్రశంసించిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ,అనంతగిరి: ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, నిజాలను నిర్భయంగా రాస్తూ, వార్తా కథనాలను పాఠకులకు అందిస్తున్నది 'దిశ' పత్రిక మాత్రమేనని టిపిసిసి మాజీ అధ్యక్షులు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో 'దిశ' దినపత్రిక 2022 నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. అనతికాలంలోనే పాఠకుల అభిమానాన్ని చూరగొని దినదినాభివృద్ధి చెందుతున్న 'దిశ' పత్రికకు ఆయన అభినందనలు తెలిపారు. సంచలన కథనాలతో 'దిశ' దూసుకుపోతుందని, మరిన్ని విజయాలు సాధించాలని పేర్కొన్నారు. అదేవిధంగా కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాలకు,పేదల పక్షాన బాసటగా నిలవాలని వారు ఈ సందర్భంగా సూచించారు.

Next Story

Most Viewed