ఆధ్యాత్మికతను రంజాన్ పెంపొందిస్తుంది..!

by Sumithra |
ఆధ్యాత్మికతను రంజాన్ పెంపొందిస్తుంది..!
X

దిశ, దేవరకొండ : రంజాన్ పండుగ ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని, దేవరకొండ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్, మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలోని మైనంపల్లి ఈద్గా వద్ద ముస్లిం మైనార్టీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ లు మాట్లాడుతూ దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు జీవనశైలిని మారుస్తుందని వారు పేర్కొన్నారు. అందరికీ అల్లా దీవెనలు ఉండాలని వారు ఆకాంక్షించారు. అత్యంత పవిత్ర పర్వదినంగా భావిస్తున్న రంజాన్ పండుగను సాంప్రదాయపద్ధంగా సంతోషంగా జరుపుకోవాలని వారు ముస్లిం సోదరులను కోరారు.

గంగ, యమునా, తెహజీబ్ తెలంగాణకు ప్రతీక అని లౌకికవాదం, మత సామరస్యం కాపాడడంలో తెలంగాణ యావత్తు భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, ఎంపీపీ నల్లగాస్ జాన్ యాదవ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, మారుపాకుల సురేష్ గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు శిరందాస్ కృష్ణయ్య, రహత్ అలీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఏ సిరాజ్ ఖాన్, నాయిని మాధవరెడ్డి, ఎండీ యూనస్, ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, కొర్ర రాంసింగ్ నాయక్, మహమ్మద్ ఉమెర్ ఖాసీం, నాయకులు పొన్నెబోయిన సైదులు, మహమ్మద్ రైస్, మహమ్మద్ తౌఫిక్ ఖాద్రి, బొడ్డు గోపాల్, బొడ్డుపల్లి కృష్ణ, ఎం.డీ బురాన్, ఎండి జావిద్, ఇస్మాయిల్, మౌలానా ముఫ్తీ జావిద్ హుస్సేన్, ఎండి జానీ బాబా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story