- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిధుల ఖర్చు పై నిర్లక్ష్యం.. పనులు చేయించడంలో విఫలం
దిశ, నల్లగొండ బ్యూరో : ఎంపీ లాడ్స్ కింద రూ.కోట్లు నిధులు విడుదలవుతున్నా వాటిని ఖర్చు చేయడంలో తాత్సారం జరుగుతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి నిధులు (ఎంపీ లాడ్స్) ఖర్చు పెట్టడంతో నిర్లక్ష్యం అలుముకుంది. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకోవడంలో ఎంపీలు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పార్లమెంటు సభ్యుల నిధుల (ఎంపీ లాడ్స్) వినియోగంలో మన ఎంపీలు వెనుకబడ్డారు. పనులకు ప్రతిపాదనలు, శంకుస్థాపనల పై చూపిన శ్రద్ధ.. వాటిని పూర్తి చేయడంలో చూపడం లేదు. ఫలితంగా 17వ లోక్ సభ కాలంలో మంజూరైన పనులు.. ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఖర్చు చేసింది 60 శాతమే..
2019 - 2024 వరకు నల్లగొండ పార్లమెంటు పరిధిలో కేంద్రం సుమారు రూ. 18 కోట్లు మంజూరు చేసింది. అందులో అప్పటి ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 38 పనులు మంజూరు చేయగా వాటి అంచనా విలువ రూ.1.67కోట్లు. అయితే అందులో ఇప్పటివరకు 32 పనులు పూర్తి చేసి రూ.1.41కోట్లు ఖర్చు చేశారు. ఇంకా ఆరు పనులు ప్రారంభం కాలేదు. రూ.23 లక్షలు నిధులు ఖర్చు చేయలేదు.
రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ 2018 - 19 నుంచి 2023 - 2024 వరకు 254 పనులకు గాను రూ.11 కోట్లు మంజూరు చేయించారు. అయితే అందులో 222 పనులు పూర్తి కాగా రూ.8.86 కోట్లు ఖర్చు చేశారు. మరో రెండు పనులు పురోగతిలో ఉండగా వాటి కోసం రూ.36.64 లక్షలు ఖర్చు చేశారు. ఇంకా 30 పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2019 - 20 నుంచి 2023 - 24 వరకు దాదాపు 262 పనుల కోసం రూ.5.68కోట్లు బడ్జెట్ను మంజూరు చేయించారు. అందులో ఇప్పటి వరకు 231 పనులను పూర్తి చేసి రూ.4.79కోట్లు వినియోగించారు. నేటికీ 32 పనులు అసలు ప్రారంభం కాలేదు.
ప్రస్తుతం ఉన్న ఎంపీలలో భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి 2024 - 25 సంవత్సరం కింద 29 పనుల కోసం సుమారు రూ.33.50లక్షలు మంజూరు చేయగా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అదేవిధంగా హైదరాబాద్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మూడు పనుల కోసం రూ.15 లక్షలు మంజూరు చేశారు. నిజామాబాద్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి ఒక్కపని కోసం రూ.5 లక్షలు కేటాయించారు. ఖమ్మం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రెండు పనుల కోసం రూ.9.96 లక్షలు బడ్జెట్ మంజూరు చేయగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. అంటే ప్రస్తుత పార్లమెంటులో 35 పనులు అసలు ప్రారంభం కాలేదు. గత పార్లమెంటు కాలంలో మంజూరైన 68 పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు.
పదవీకాలం ముగిసిన...
మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 589 పనుల కోసం సుమారు రూ.18.96 కోట్లు మంజూరు కాగా దాదాపు రూ.15కోట్ల వరకు వినియోగించారు. ఇంకా 103 పనులు ప్రారంభం కాలేదు. అయితే ఈ మొత్తం పనులలో మాజీ పార్లమెంట్ సభ్యులు నేటి తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ల పదవీకాలం ముగిసింది. అయినా వారు మంజూరు చేయించిన 554 పనులలో 105 పనులు కాకపోవడంతో నిధులు ములుగుతున్నాయి..
అంటే నిధులు మంజూరు చేయించడంలో ప్రత్యేక శ్రద్ధ వాటిని సక్రమంగా వినియోగించడంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు శ్రద్ధ లేకపోవడం పనులు పెండింగ్లో ఉండడమే దానికి నిదర్శనం.