- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాడి పునరావృతం అయితే ఎదురుదాడి తప్పదు: కుంభం
దిశ, వరిగొండ: రేవంత్ రెడ్డిపై, యువజన కాంగ్రెస్ నాయకులపై దాడి పునరావృతం అయితే కాంగ్రెస్ శ్రేణులు తిరిగి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులపై ఎదురుదాడి చేస్తామని డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం వలిగొండ పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆదేశాలతో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితోపాటు జిల్లాలలో, మండలాలలో, గ్రామాలలో చేపట్టిన జోడో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టి స్వాగతం పలకటంతో అధికారం ఎక్కడ కోల్పోతామోనన్న భయంతో బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార బలంతో ప్రతిపక్ష నాయకులను ఎక్కడికక్కడా అడ్డుకోవడం పనికి మాలిన పని అని ఎదేవా చేశారు.
రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల మేనిఫెస్టోలను అమలు పరచకుండా తిరిగి మోసపూరిత వాగ్దానాలను చేసి మళ్లీ మోసం చేసేందుకే సిద్ధమైనదని ప్రజలు గ్రహించడంతో ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, బత్తిని సహదేవ్, గరిసె రవి, బద్దం సంజీవరెడ్డి, పలుసం సతీష్, బోళ్ల శ్రీనివాస్, కాసుల వెంకన్న, రాపోలు శ్రీనివాస్, కొండూరు సాయి, పల్లెర్ల సుధాకర్, ఖుర్షిద్ తదితరులు పాల్గొన్నారు.