- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎక్కడి పనులు అక్కడే.. నిధుల విడుదల అనుమానమే..?
దిశ,హాలియా:కొత్త మున్సిపాలిటీలకు నూతన సొబగులు దిద్దాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీకి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల రూపాయల వరకు పలు అభివృద్ధి పథకాల కింద నిధులను మంజూరు చేసింది. ఇందులో హాలియా మున్సిపాలిటీకి టీఎండీసీ కింద (తెలంగాణ మున్సిపాలిటీ అభివృద్ధి పథకం) కింద రూ. 8 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు అప్పుగా మున్సిపాలిటీలకు అందజేసింది. ఇందులో హాలియా మున్సిపాలిటీకి పలు అభివృద్ధి పనులకు గాను రూ.8.50 కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చింది. వీటితోపాటు మరో 16.5 కోట్ల రూపాయలను ప్రత్యేక అభివృద్ధి పథకాల కింద మంజూరు చేసింది. ఈ నిధులతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇందుగ్గాను హాలియా మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పథకాలకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఇందులో ప్రధానంగా డిజిటల్ లైబ్రరీ,ఆడిటోరియం,ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్‌వెజ్ మార్కెట్, నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాలువ కట్టపై ప్రజలను ఆహ్లాదం పరిచేందుకు పలు నిర్మాణాలు, ప్రధాన కాలువ కట్ట సీసీ రహదారి నిర్మాణాలు చేపట్టారు. ఇందుకుగాను గత ప్రభుత్వం సుమారు రూ.10 5 కోట్ల రూపాయలు సైతం వివిధ దశల్లో చెల్లించినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. కాగా మున్సిపాలిటీ గ్యారెంటీ కింద రూ.8.50 కోట్ల గాను గత ప్రభుత్వం రూ.2కోట్లను మాత్రమే విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వంలో చేపట్టిన ఇట్టి పనులకు మున్సిపల్ పాలకవర్గం పట్టణ ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదురయ్యాయి. కాగా గత ప్రభుత్వం పూర్తిగా టెండర్ పద్ధతిలోనే పనులు చేయించడంతో స్థానిక ప్రజల అభిప్రాయాలకు కూడా గౌరవం లేకుండా పోయింది. ఇందులో హాలియా ప్రధాన ఎడమకాలువపై సుమారు 800 మీటర్ల మీద సీసీ రహదారి రైలింగ్ వాల్ టైల్స్ పిల్లల ఆటలు వస్తువులు తదితర నిర్మాణాలు చేపట్టారు. ప్రధాన ఎడమ కాలువ కట్ట కింద భాగంలో సుమారు 1.5 కిలోమీటర్ మేరా సిసి రహదారులు డివైడర్లు నిర్మించారు.
ఇట్టి పనుల కథ ముగిసినట్లేనా..?
హాలియా మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పథకాల కింద గత ప్రభుత్వం రూ.25 కోట్ల మీద పనులను చేపట్టింది. ఇందులో సుమారు 50 శాతం మేర పనులను పూర్తి చేసినప్పటికీ కొత్తగా అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్టి పనులను కొనసాగించేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు వివిధ పథకాల్లో మంజూరైన సుమారు రూ.10 50 కోట్ల మీద నిధులు విడుదల చేసినప్పటికీ మిగతా నిధులను హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి వినియోగించాలని సంకల్పంతో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతుండడంతో ప్రస్తుత ప్రభుత్వం ఇట్టి విధానాన్ని కొనసాగిస్తే హాలియా మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో సీసీ రహదారులు డ్రైనేజీలు అర్బన్ పార్కులు నిర్మించవచ్చన్న ఆలోచన చేస్తుంది. ఇట్టి విషయం పై మరి కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అనధికారికంగా పేర్కొంటున్నారు. హాలియా పట్టణంలో ఇప్పటికే రైతు బజార్ ఏర్పాటుపై చిరు వ్యాపారులు ఆశతో ఉన్నప్పటికీ ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలు శాశ్వతంగా ఆగిపోయే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
ఆగిపోయిన భవన నిర్మాణాలు..
గత ప్రభుత్వంలో హాలియా మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పథకాల్లో మంజూరైన భవన నిర్మాణాలు కొనసాగింపుపై నీలి నీలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టకపోవడంతో పాటు కొనసాగింపు పై శ్రద్ధ చూపకపోవడంతో పనుల పురోగతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే హాలియా మున్సిపల్ పాలకమండలి మిగిలిన అభివృద్ధి నిధులను హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి వినియోగించాలని స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినట్లు సమాచారం.
మిగిలిన నిధులతో హాలియా పట్టణంలో అసంపూర్తిగా ఉన్న సీసీ రహదారులు కొత్త డ్రైనేజీలు స్ట్రీట్ లైటింగ్‌లతో పాటు ప్రధాన రహదారిపై డ్రైనేజీ తదితర పనులను చేపట్టాలని కోరుతున్నారు. దీంతో ఇప్పటివరకు గత ప్రభుత్వంలో చేపట్టిన పనులపై నీలి మేఘాలు కమ్ముకున్నట్లే. అభివృద్ధి నిధులపై ఎటువంటి సమాచారం లేదు.. మున్వర్ అలీ మున్సిపల్ కమిషనర్ హాలియా గత ప్రభుత్వంలో చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్‌వెజ్ మార్కెట్ డిజిటల్ లైబ్రరీ ఆడిటోరియం తదితర పథకాలు కొనసాగించేందుకు ప్రస్తుత ప్రభుత్వంలో నిధులు విడుదల కాలేదు. ఇటు నిధులపై తమకు ఎటువంటి సమాచారం అందలేదు.