కోదాడ చుట్టూ కబ్జాలమయం..కాల్వలను ఆక్రమించి అక్రమ కట్టడాలు

by Jakkula Mamatha |
కోదాడ చుట్టూ కబ్జాలమయం..కాల్వలను ఆక్రమించి అక్రమ కట్టడాలు
X

దిశ,కోదాడ:నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అని పూర్వికులు గ్రామాల్లో పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరేందుకు వాగులు వంకలు నిర్మించారు. కాగా నేటి మనుషులు కాసులకు కక్కుర్తి పడి వరదలను తెచ్చి పెడుతున్నారు. కోదాడ పట్టణం ఏ తీర ప్రాంతాల్లో ఉన్న పట్టణం కాదు. సముద్రం ఏమీ లేదు. పొంగే నదులు లేవు అయినా తీర ప్రాంతం వద్ద ఉన్న గ్రామం మాదిరిగా కోదాడ పట్టణంలో మునుపెన్నడూ లేని అల్లకల్లోలం జరిగింది. ప్రధానంగా గత పదేళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలు రావడంతో అధికార పార్టీ ముసుగులో కొందరు వ్యాపారులు అధికారుల జేబులు నింపి వాగులు వంకలు ఆక్రమించుకున్నారు. ఫలితంగా కోదాడలో వరదలు చూడాల్సి వచ్చింది. ప్రధానంగా కట్ట కొమ్ముగూడెం రోడ్డులో ఎన్ఎస్పీ పంట కాలువ నేడు కనుమరుగైపోయింది. ఎన్ఎస్పీ అధికారులు మున్సిపల్ అధికారులు లంచాలకు మరిగి కాల్వలో అక్రమ కట్టడాలు కడుతున్న నోరు మెదపలేదు.

నేటికీ కాలువలోనే పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ మొరం పోసి ఎత్తు పెంచడంతో వరద నీరు పోయే దారి లేక పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నయా నగర్‌లో సైతం ఎర్రకుంట చెరువు నుంచి వచ్చే వాగు నయా నగర్ లోని పంట కాలువ నుండి తమ్మర రోడ్డుకు ఉన్న వాగుకు చేరేవి. ఆ పంట కాలువలో ఇల్లు కట్టి మూసివేయడంతో నీరంతా అనంతగిరి రోడ్డు దాటి ఇళ్లలోకి చేరింది. ఎర్రకుంట చెరువు వాగు సహితం ఆక్రమణలకు గురి అయింది. జరుగుతున్నదంతా చూసిన అధికారులు ప్రజాప్రతినిధులు ప్రస్తుతం మాత్రం మేము అండగా ఉంటాం అంటూ పరామర్శలకు వెళుతున్నారు. సమ శీతోష్ణ ప్రాంతంగా ఉన్న కోదాడ ను కబ్జాదారులు సముద్రం పక్కన ఉన్న వరద ప్రభావిత పట్టణంగా మార్చారు. జనమంతా మూడు రోజుల నుంచి కోదాడలో వరద పరిస్థితిని చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు .హైదరాబాదులో ప్రభుత్వ స్థలాల ను ఆక్రమించిన కట్టడాలను కూల్చివేస్తున్నట్లుగా కోదాడలో కోడ్రాను తెచ్చి వాగులు వంకలు చెరువులో ప్రభుత్వ స్థలాల్లో రాజకీయ నాయకులు అండతో కట్టిన కట్టడాలు కూల్చివేసిన కోదాడ ప్రజలకు ప్రశాంత వాతావరణం కలిగించాలని కోరుతున్నారు.

కోదాడలో అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ..

కోదాడ పట్టణంలో హైవే ప్రధాన రహదారుల వెంట నిర్మించే భవనాలు కనీస నిబంధనలు పాటించడం లేదు. మరోవైపు పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది గతంలో రూ. 3 కోట్ల ఖర్చు చేసి పట్టణంలో జాతీయ రహదారి పొడవున ఇరువైపులా డ్రైనేజీ నిర్మించ నిర్మించారు. కానీ మున్సిపల్ ఆఫీసర్ నిర్లక్ష్యం కారణం. నిర్వహణ లేని కారణంగా మీరంతా ఎక్కడికక్కడే నిలిగిపోతుంది. వరదలు వచ్చిన టైంలోనే స్పందించి డ్రైనేజీ పగలగొట్టి చెత్త చెదరాన్ని తొలగిస్తున్నారు. తర్వాత పట్టించుకోవడంలేదని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇష్టారాజ్యంగా పర్మిషన్లు..

మున్సిపల్ అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇస్తున్నారు. ఎన్ఎస్పీ కాల్వలను ఆక్రమించుకొని ఇంటి నిర్మాణాలు చేపడుతున్న ఎన్ఎస్పీ అధికారులు, మున్సిపల్ అధికారులు కాని కన్నెత్తి చూడరు. దీంతో కబ్జాలకు వరంగా వారి కాల్వలను చెరువులను ఆక్రమించుకొని మరి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఉత్తం పద్మావతి నగర్ నుంచి వచ్చే పంట కాల్వను కొంతమంది ఆక్రమించుకొని నిర్మాణలు చేపట్టిన అటువైపు మున్సిపల్ అధికారులు కానీ ఎన్ఎస్పీ సిబ్బంది గాని వెళ్ళలేదు దాని మూల్యమే జలదిగ్భందం. వరదలో ఇద్దరు మృత్యువాత పడ్డారంటే ఏ మేరకు పట్టణంలో వరద వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలు మాకు కూడా హైడ్రా కావాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సి ఉంది.

Advertisement

Next Story