- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్యాయాన్ని అడిగితే అక్రమ కేసులు పెట్టించారు
దిశ, సూర్యాపేట: ప్రజాక్షేత్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తే తనపై వ్యక్తిగత కక్ష సాధించేలా తప్పుడు కేసులు పెట్టి బెదిరించారని బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ఆరోపించారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని పట్టణంలోని వివిధ వార్డులకు, గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసీ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ సమక్షంలో చేరారు. అందులో 2వ వార్డుకు చెందిన ఆవుదొడ్డి శ్రీకాంత్, 18వ వార్డులో వాంకుడోత్ అమృనాయక్, శంకర్ నాయక్ , దస్రు నాయక్, సక్రు నాయక్, లింగా నాయక్ , నాగు నాయక్ , మన్సూర్ , రవి , లింగ తదితరులు పార్టీలో చేరగా 25వ వార్డులో బీజేపీ వార్డు అధ్యక్షులు అంగిరేకుల సోమయ్య, మామిడి మహేశ్వరి రాధిక తదితరులు పార్టీలో చేరారు. అనంతరం సూర్యాపేట మండలం ఎండ్లపల్లి గ్రామంలో బీజేపీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకంటి శంకర్, రాములుతో పాటు పలువురు పార్టీలో చేరారు. అనంతరం పెన్ పహాడ్ మండలంలో జరిగిన బూత్ స్థాయి కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాతర్ల పహాడ్ సర్పంచ్ కేశబోయిన మల్లయ్య, నాయకులు గండూరి రమేష్, కుంభం నాగరాజు, నిమ్మనగొట్టి జానయ్య , మీర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.