- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఆహ్వానం మేరకే ఈ స్థితికి చేరాను : ఎమ్మెల్యే
దిశ, తుంగతుర్తి: తన మాట కఠినమే అయినప్పటికీ పనితనంలో మాత్రం గొప్పగా ఉంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. ముందొక మాట..వెనకొక మాట చెప్పే మనస్తత్వం తనది కాదని, ఎక్కడైనా ఎప్పుడైనా తాను చెప్పిందే చేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో మంగళవారం జరిగిన ఆ పార్టీ సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ఏకపక్షంగా వ్యవహరించలేదని, అన్ని పక్షాల వారికి సంక్షేమ ఫలాల లబ్ధి పొందారని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తనను కేసీఆర్ ఆహ్వానం మేరకే ఈ స్థితికి చేరానని వివరించారు. వచ్చేనెల 9న తుంగతుర్తిలో నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఏ పని చేపట్టాలన్న ఒక లక్ష్యం అంటూ ఉంటేనే ముందుకు సాగుతామని, సాయుధ పోరాట యోధుల చరిత్ర కలిగిన తుంగతుర్తి గడ్డపై ఘోరీలు, స్మారక స్తూపాలే అభివృద్ధి చెందాయని గత పాలకులను ఉద్దేశించి అన్నారు. చరిత్రలో ఎరగని తుంగతుర్తి అభివృద్ధి తనతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు గుజ్జ యుగేందర్ రావు, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్ బాబు, డీసీసీబీ డైరెక్టర్ సైదులు, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ రజాక్, ఎంపీపీ కవిత రాములు, నాయకులు రాములు, శ్రీశైలం, గోపగాని రమేష్, కందాల దామోదర్ రెడ్డితో పాటు నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి మండలాల పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు.